పేదల ఆరోగ్యసంరక్షణే కూటమి ప్రభుత్వ కర్తవ్యం – నవులూరులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
మంగళగిరి రూరల్, ఆగస్టు 21:
పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని గ్రామ పార్టీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి రూపంలో నారా చంద్రబాబు నాయుడు గారు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు.
నవులూరు గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పార్టీ నాయకులు స్వయంగా ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా
గరికపాటి పర్షిత శ్రీకు రూ. 31,934,
హరి లలిత ప్రత్యూషకు రూ. 68,283,
మేకల పల్లవికి రూ. 23,000 విలువైన చెక్కులు అందజేయబడ్డాయి.
గ్రామ పార్టీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ వైద్యం సకాలంలో అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆరోగ్య భరోసా కల్పించడంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ యస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, అలాగే రుద్రు శ్రీనుబాబు, చిలకలపూడి శేషగిరి, బత్తుల నాగరాజు, కొల్లి వెంకటరావు, కొత్త శ్రీనివాసరావు, మర్రి ఏసుబాబు, షేక్ నజీర్, కట్టెపోగు ముత్తయ్య, వేమూరి శ్రావణ్, మట్టకొయ్య అశోక్, తోట శ్రీనివాస్, తోట సాంబ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి