పోస్ట్‌లు

కంచర్లపాలెం గ్రామం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కంచర్లపాలెంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన

చిత్రం
                                         తెనాలి, ఆగస్టు 12: తెనాలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కంచర్లపాలెం నుంచి తేలప్రోలు మీదుగా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి కలిపే 1.3 కిలోమీటర్ల పొడవు రహదారిని రూ. 1.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.