పోస్ట్‌లు

జక్కంపూడి రాజా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్ జగన్

చిత్రం
  తాడేపల్లి, 06 ఆగస్టు 2025: మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతిని పురస్కరించుకొని, ఆయన సేవలను స్మరించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన నివాసంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి గారి సేవలను వైఎస్ జగన్ గారు స్మరించుకుంటూ, ప్రజల పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథం ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకలు సాదాసీదాగా, మర్యాదపూర్వకంగా జరిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు.