పోస్ట్‌లు

మంగళగిరి వార్తలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలను కలుసుకున్న మంత్రి నారా లోకేష్

చిత్రం
                                         మంగళగిరి: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు (అర్జీలు) సమర్పించగా, మంత్రి ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను పూర్తిగా విన్నారు. లోకేష్, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరిత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అవసరమైన విభాగాలకు అర్జీలను పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని తెలిపారు. ప్రజలతో స్వయంగా మమేకమై, సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించిన మంత్రి పట్ల హాజరైన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మంగళగిరిలో ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభం

చిత్రం
                                        మంగళగిరి పట్టణంలోని జీఆర్ స్కూల్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటైన ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ షోరూమ్‌ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మనవడు ఆర్. రోహిత్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభమైంది.                                        షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను పరిశీలించిన మంత్రి, చేనేత వస్త్రాలను వీక్షించారు. శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీమతి నారా బ్రాహ్మణి కోసం చేనేత చీరలను స్వయంగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన — అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన

చిత్రం
                                       మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.                                     లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ప్రారంభం          మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన అనంతరం, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించిన ఆమె, చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్ల వివరాలు, చేనేత రంగానికి అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ...

మంగళగిరి నియోజకవర్గంలో రేపు మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన

చిత్రం
                                        మంగళగిరి, ఆగస్టు 13: రేపు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన చేపట్టనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని స్థానికులతో సమావేశమవుతారు. పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ఉదయం 10:30 గంటలకు — మంగళగిరి గోలి వారి వీధిలో లక్ష్మి శారీస్ వస్త్ర దుకాణాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు — కాజ గ్రామంలోని పంచాయతి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కుట్టుమిషన్ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి సందర్శిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు — పాత మంగళగిరి జీ ఆర్ స్కూల్ రోడ్‌లోని RR హ్యాండ్లూమ్ షోరూమ్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది.

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మంగళగిరిలో చిరు వ్యాపారులకు ఉపాధి బండ్ల పంపిణీ

చిత్రం
  మంగళగిరి టౌన్: ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి పట్టణంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద మంగళవారం చిరు వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మొత్తం ఆరుగురు లబ్ధిదారులకు ఉపాధికి ఉపయోగపడే బండ్లు అందజేశారు. ఇందులో: టిఫిన్ బండ్లు – 1. కన్నెబోయిన ప్రమీల (30వ వార్డు) 2. పళ్ళపాటి గోపాలరావు (నవులూరు) తోపుడు బండ్లు – 1. షేక్ గాలిబ్ (16వ వార్డు) 2. జొన్నకూటి వెంకటరమణ (27వ వార్డు) 3. పామిశెట్టి కామేశ్వరరావు (4వ వార్డు) 4. రెడ్డి వరలక్ష్మి (22వ వార్డు బండ్లు పొందిన లబ్ధిదారులు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారు ముందుగా అద్దె బండ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారన్నారు. తమ అవసరాన్ని గుర్తించిన మంత్రి, వెంటనే స్పందించి, స్థానిక నాయకుల చేతుల మీదుగా బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ మాట్లాడుతూ – > “చిరు వ్యాపారుల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉపాధికి తోడ్పడేలా బండ్లు, కుట్టుమిషన్లు, జలధారాలు, ఆరోగ్య రథాలు, అన్నా క్యాంటీన్లు, పా...