మంగళగిరిలో ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభం
మంగళగిరి పట్టణంలోని జీఆర్ స్కూల్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటైన ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ షోరూమ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మనవడు ఆర్. రోహిత్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను పరిశీలించిన మంత్రి, చేనేత వస్త్రాలను వీక్షించారు. శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీమతి నారా బ్రాహ్మణి కోసం చేనేత చీరలను స్వయంగా కొనుగోలు చేశారు.
ఈ కార్యక్రమంలో నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి