పోస్ట్‌లు

NaraLokesh లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మంగళగిరి | రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలతో ఆత్మీయంగా గడిపిన మంత్రి నారా లోకేష్

చిత్రం
                                    రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు, ఉండవల్లి నివాసానికి విచ్చేసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు.                               ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ, “నాకు సొంతంగా అక్కలు, చెల్లెళ్లు లేరు. మంగళగిరి మహిళలు నా అక్కాచెల్లెళ్లు. మీరందించిన ఆశీస్సులు నాకు కొండంత బలాన్నిచ్చాయి. మీ ఆశీస్సులతో మంగళగిరిని రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను” అని అన్నారు. మంత్రివర్యులు మాట్లాడుతూ, 2019లో తొలిసారి పోటీ చేసినప్పుడు 5,300 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసినా, ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేసి, గత ఎన్నికల్లో రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీతో విజయం సాధించానని గుర్తుచేశారు. ఎన్నికల హామీలలో ముఖ్యమైన ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందించడంలో...