పోస్ట్‌లు

Police Department లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై షేక్ నూరి ఫాతిమా గారి తీవ్ర అభిప్రాయం

చిత్రం
 గుంటూరు: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా గారు స్పందించారు. వీడియో వెనుక దాగిన ఉద్దేశ్యాన్ని, దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు. "ఏవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. పోలీసు యంత్రాంగం మొత్తం మీ ఆధీనంలో ఉంది. అధికారంలో ఉన్న మీరు మా మీద బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొని, వీవరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదే ఉంది," అని షేక్ నూరి ఫాతిమా గారు స్పష్టం చేశారు.