పోస్ట్‌లు

ఎమ్మెల్యే గల్లా మాధవి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరు | 21వ డివిజన్‌లో కొత్త తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవి

చిత్రం
                                                 గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విఐపి రోడ్, కృష్ణ బాబు కాలనీలో 21వ డివిజన్ నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు హాజరై, ఫిత్తు కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మాట్లాడుతూ, “పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు మరింత చేరువ కావడం కోసం కొత్త కార్యాలయం ఉపయోగపడుతుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక కేంద్రంగా పనిచేస్తుంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానికులు పాల్గొన్నారు.                              

గుంటూరు | రక్షాబంధన్ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్రకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి

చిత్రం
                                                రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని గుంటూరు నగరంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు, గుంటూరు నగర మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర గారికి రాఖీ కట్టి సోదర-సోదరీమణుల బంధానికి మరింత గౌరవం చేకూర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, “సోదర సోదరీమణుల మధ్య ఉండే మమకారం, పరస్పర గౌరవం సమాజానికి స్ఫూర్తి” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మరియు స్థానికులు పాల్గొన్నారు.

గుంటూరు | ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి

చిత్రం
                                       గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు పాల్గొని, ఆదివాసీ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలను వివరించారు.                                 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, “ఆదివాసీ సమాజం సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాలను కాపాడుతూ, వారిని ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, మరియు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.                                

గుంటూరు | రాఖీ పౌర్ణమి సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ నసీర్

చిత్రం
                                              అక్క-తమ్ముళ్ల మమకారం, అన్నా-చెల్లెళ్ల ప్రేమ కాలాన్నికూడా మించే పవిత్ర రక్త బంధంగా నిలిచే రక్షాబంధనం పండుగను గుంటూరు ప్రజలు ఆత్మీయంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి ఈ శుభదినాన, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మహ్మద్ నసీర్ గారికి రాఖీ కట్టి, సోదర సోదరీమణుల బంధానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా మహ్మద్ నసీర్ గారు, “నా సోదరీమణుల ఆశీర్వాదం, ప్రేమ, అండ నా జీవితంలో అతి పెద్ద బలం” అని పేర్కొన్నారు.                                        అలాగే తనను అన్నగా, తమ్ముడిగా భావించి రాఖీ కట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, మరియు తన సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.