గుంటూరు | రాఖీ పౌర్ణమి సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ నసీర్

                                             


అక్క-తమ్ముళ్ల మమకారం, అన్నా-చెల్లెళ్ల ప్రేమ కాలాన్నికూడా మించే పవిత్ర రక్త బంధంగా నిలిచే రక్షాబంధనం పండుగను గుంటూరు ప్రజలు ఆత్మీయంగా జరుపుకున్నారు.


రాఖీ పౌర్ణమి ఈ శుభదినాన, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మహ్మద్ నసీర్ గారికి రాఖీ కట్టి, సోదర సోదరీమణుల బంధానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా మహ్మద్ నసీర్ గారు, “నా సోదరీమణుల ఆశీర్వాదం, ప్రేమ, అండ నా జీవితంలో అతి పెద్ద బలం” అని పేర్కొన్నారు.

                                      


అలాగే తనను అన్నగా, తమ్ముడిగా భావించి రాఖీ కట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, మరియు తన సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు