పోస్ట్‌లు

వీవర్‌శాల లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఈరోజు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

చిత్రం
 అమరావతి, గుంటూరు జిల్లా ఈరోజు గురువారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు. ఉదయం 9:30 గంటలకు, మంగళగిరి వీవర్‌ శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో గతంలో స్థాపించబడిన వీవర్‌శాలను సీఎం సందర్శించారు. మగ్గాల పనితీరును పరిశీలించి, చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియను సమీక్షించారు. అలాగే, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, వాటి విస్తరణపై చేనేత కళాకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం, చేనేత కుటుంబాలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు విన్నారు. ఈ పర్యటన ముగింపుగా నిర్వహించిన ప్రజా వేదిక సభలో, ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో: మంత్రి మరియు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.