పులివెందుల MLC రమేష్ యాదవ్‌పై దాడిని ఖండిస్తూ గుంటూరులో నిరసన

గుంటూరు, ఆగస్టు 7: గుంటూరు హిందూ కాలేజీ సెంటర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహం వద్ద నేడు నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. పులివెందుల MLC శ్రీ రమేష్ యాదవ్ గారిపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే 🔹 విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేను గోపాల్ రెడ్డి గారు 🔹 BC జిల్లా అధ్యక్షులు తదిబోయిన వేణు గారు 🔹 గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ నందేటి రాజేష్ గారు 🔹 రాష్ట్ర BC సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.