పోస్ట్‌లు

మహ్మద్ నసీర్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరులో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం ఘన ప్రారంభం – గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ పాల్గొన్నారు

చిత్రం
                                              గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ – ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.                                          మహిళల రవాణా సౌకర్యం పెంచడం, ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.                                              

గుంటూరు | రాఖీ పౌర్ణమి సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మహ్మద్ నసీర్

చిత్రం
                                              అక్క-తమ్ముళ్ల మమకారం, అన్నా-చెల్లెళ్ల ప్రేమ కాలాన్నికూడా మించే పవిత్ర రక్త బంధంగా నిలిచే రక్షాబంధనం పండుగను గుంటూరు ప్రజలు ఆత్మీయంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి ఈ శుభదినాన, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు మహ్మద్ నసీర్ గారికి రాఖీ కట్టి, సోదర సోదరీమణుల బంధానికి నిదర్శనంగా నిలిచారు. ఈ సందర్భంగా మహ్మద్ నసీర్ గారు, “నా సోదరీమణుల ఆశీర్వాదం, ప్రేమ, అండ నా జీవితంలో అతి పెద్ద బలం” అని పేర్కొన్నారు.                                        అలాగే తనను అన్నగా, తమ్ముడిగా భావించి రాఖీ కట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, మరియు తన సోదరీమణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.