మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు

మంగళగిరి, ఆగస్ట్ 6: మంగళగిరి పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 38 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 508 మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విస్తృత అవకాశాలు వీటిజేఎం & ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల ఆవరణంలో బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో డాటా ఎంట్రీ, BPO, రిటైల్, ఈ-కామర్స్, ఆటోమోటివ్, ఫార్మసీ, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో అనేక కంపెనీలు పాల్గొన్నాయి. ముఖ్యంగా హీరో మోటర్స్, శ్రీరాం ఫైనాన్స్, మెడ్ ప్లస్, ముత్తూట్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఏడో తరగతి నుంచి పీజీ విద్యార్హుల వరకు ఈ జాబ్ మేళాలో ఏడో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఎంఫార్మసీ, నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000 నుండి రూ.40,000 వరకు జీతం కలిగిన ఉద్యోగాలకు ని...