గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

గుంటూరు, మాయాబజార్ | గత ఐదు దశాబ్దాలుగా మారుమూల ప్రాంతంగా ఎదురైన సమస్యకు కూటమి ప్రభుత్వ హయాంలో పరిష్కారం దొరికింది. మాయాబజార్‌లో వందలాది మంది మెకానికులు, చిన్న వ్యాపారులు రోజువారీ ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న రహదారి సమస్యకు విరామం లభించింది. అత్యంత శ్రమతో జీవనోపాధి నెత్తిన బరువుగా మోస్తున్న ఈ వర్గానికి, వర్షాకాలంలో సరిగా రోడ్డు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నవే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలపై దృష్టి సారించి, మాయాబజార్ ప్రాంత అభివృద్ధికి తొలి అడుగు వేసింది. మొత్తం 30 అడుగుల వెడల్పుతో నిర్మించిన సీసీ రహదారి ఇప్పుడు ప్రజల వినియోగంలోకి వచ్చింది. ఇది స్థానికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే కాకుండా, వ్యాపార వృద్ధికి కూడా మార్గం సుగమం చేస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోహమ్మద్ నసీర్ గారు మాట్లాడుతూ – > "రాష్ట్ర అభివృద్ధి దిశగా నడుస్తున్న ప్రయాణంలో కొన్ని అపోహలు, పుకార్లు చుట్టుముడతాయి. కానీ ప్రజల విశ్వాసం పట్ల నిబద్ధతతో ముందుకు సాగతా. ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం. ఈ రోడ్డుతో ప్రజలకు శాశ్వతంగా ఒక మంచి పరిష్కారం లభించింది. ...