పోస్ట్‌లు

JVMHospital లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరు కాకాని రోడ్‌లో జేవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

చిత్రం
                                                   గుంటూరు, ఆగస్టు 17 : గుంటూరు కాకాని రోడ్డులో ఆధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన జేవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి గారు నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆధునిక ఆసుపత్రులు ఎంతో ఉపయుక్తమవుతాయని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, 24 గంటల అత్యవసర వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.