పోస్ట్‌లు

Guntur Politics లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరులో “బాబు షూరిటీ - మోసం గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా 23వ వార్డ్ సమావేశం

చిత్రం
                                   గుంటూరు: పశ్చిమ నియోజకవర్గంలోని 23వ వార్డులో “బాబు షూరిటీ - మోసం గ్యారంటీ” కార్యక్రమానికి సంబంధించి వార్డ్ సమావేశం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ అంబటి రాంబాబు గారు, 29వ వార్డ్ కార్పొరేటర్ షేక్ రోషన్ గారు, వార్డ్ నాయకులు కోటి గారు, సుర్సని వెంకట్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డ్‌లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగించిన నాయకులు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరియు స్థానిక అవసరాలపై చర్చించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.                                         

గుంటూరులో వైఎస్సీపీ యూత్ లీడర్ల బర్త్‌డే సెలబ్రేషన్స్ – కేక్ కట్ చేసిన ఫాతిమా గారు

చిత్రం
 గుంటూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి చెందిన ప్రముఖ నాయకులైన జిల్లా వైఎస్సీపీ యూత్ అధ్యక్షులు శ్రీ సురాజ్ గారు, మరియు తూర్పు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు శ్రీ శుభాని గారు జన్మదినాలను పురస్కరించుకుని, ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ప్రత్యేక అతిథిగా పాల్గొని, కేక్ కట్ చేసి, ఇద్దరు యువనేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.                                 ఈ సందర్భంగా ఫాతిమా గారు మాట్లాడుతూ, "పార్టీలో యువ నాయకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. యువతను చైతన్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిమీద ఉంది" అని పేర్కొన్నారు. కార్యక్రమానికి పలువురు యువజన నేతలు, కార్యకర్తలు హాజరై, శుభాకాంక్షలు తెలియజే శారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై షేక్ నూరి ఫాతిమా గారి తీవ్ర అభిప్రాయం

చిత్రం
 గుంటూరు: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా గారు స్పందించారు. వీడియో వెనుక దాగిన ఉద్దేశ్యాన్ని, దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు. "ఏవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. పోలీసు యంత్రాంగం మొత్తం మీ ఆధీనంలో ఉంది. అధికారంలో ఉన్న మీరు మా మీద బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి. వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొని, వీవరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదే ఉంది," అని షేక్ నూరి ఫాతిమా గారు స్పష్టం చేశారు.