గుంటూరులో వైఎస్సీపీ యూత్ లీడర్ల బర్త్‌డే సెలబ్రేషన్స్ – కేక్ కట్ చేసిన ఫాతిమా గారు
గుంటూరు నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి చెందిన ప్రముఖ నాయకులైన జిల్లా వైఎస్సీపీ యూత్ అధ్యక్షులు శ్రీ సురాజ్ గారు, మరియు తూర్పు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు శ్రీ శుభాని గారు జన్మదినాలను పురస్కరించుకుని, ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ప్రత్యేక అతిథిగా పాల్గొని, కేక్ కట్ చేసి, ఇద్దరు యువనేతలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఫాతిమా గారు మాట్లాడుతూ, "పార్టీలో యువ నాయకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. యువతను చైతన్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిమీద ఉంది" అని పేర్కొన్నారు.
కార్యక్రమానికి పలువురు యువజన నేతలు, కార్యకర్తలు హాజరై, శుభాకాంక్షలు తెలియజే
శారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి