పోస్ట్‌లు

గళ్ళా మాధవి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరులో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం ఘన ప్రారంభం – గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ పాల్గొన్నారు

చిత్రం
                                              గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ – ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.                                          మహిళల రవాణా సౌకర్యం పెంచడం, ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.                                              

గుంటూరు పశ్చిమ అభివృద్ధి కోసం మంత్రి పొంగూరు నారాయణతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి భేటీ

చిత్రం
                                         గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధుల మంజూరుపై బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయిలు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిలో వీధి కుక్కల నియంత్రణ, ఖాళీ స్థలాల శుభ్రపరిచే చర్యలు, కాలువల శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, డ్రైనేజ్ సమస్యలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ – "గుంటూరు పశ్చిమ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం. వీధి కుక్కల సమస్య, పారిశుద్ధ్య లోపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని మంత్రిని కోరాను. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నేను నిరంతరం కృషి చేస్తాను" అ...

గుంటూరు 34వ డివిజన్‌లో సిసి డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన

చిత్రం
                                         గుంటూరు | 11-08-2025 గుంటూరు నగరంలోని 34వ డివిజన్, కోబాల్ట్ పేట 3వ లైన్ ప్రాంతంలో సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొని, స్థానిక ప్రజలతో మమేకమై వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా అవసరాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.