గుంటూరు పశ్చిమ అభివృద్ధి కోసం మంత్రి పొంగూరు నారాయణతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి భేటీ
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధుల మంజూరుపై బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయిలు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిలో వీధి కుక్కల నియంత్రణ, ఖాళీ స్థలాల శుభ్రపరిచే చర్యలు, కాలువల శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, డ్రైనేజ్ సమస్యలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ –
"గుంటూరు పశ్చిమ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం. వీధి కుక్కల సమస్య, పారిశుద్ధ్య లోపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని మంత్రిని కోరాను. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నేను నిరంతరం కృషి చేస్తాను" అని తెలిపారు.
మంత్రి పొంగూరు నారాయణ ఈ సమస్యలను సానుకూలంగా పరిగణించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి