మంత్రి లోకేష్ చేతుల మీదుగా మంగళగిరిలో చిరు వ్యాపారులకు ఉపాధి బండ్ల పంపిణీ
మంగళగిరి టౌన్:
ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో మంగళగిరి పట్టణంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద మంగళవారం చిరు వ్యాపారులకు టిఫిన్, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మొత్తం ఆరుగురు లబ్ధిదారులకు ఉపాధికి ఉపయోగపడే బండ్లు అందజేశారు. ఇందులో:
టిఫిన్ బండ్లు –
1. కన్నెబోయిన ప్రమీల (30వ వార్డు)
2. పళ్ళపాటి గోపాలరావు (నవులూరు)
తోపుడు బండ్లు –
1. షేక్ గాలిబ్ (16వ వార్డు)
2. జొన్నకూటి వెంకటరమణ (27వ వార్డు)
3. పామిశెట్టి కామేశ్వరరావు (4వ వార్డు)
4. రెడ్డి వరలక్ష్మి (22వ వార్డు
బండ్లు పొందిన లబ్ధిదారులు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారు ముందుగా అద్దె బండ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారన్నారు. తమ అవసరాన్ని గుర్తించిన మంత్రి, వెంటనే స్పందించి, స్థానిక నాయకుల చేతుల మీదుగా బండ్లను అందజేశారు.
ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ మాట్లాడుతూ –
> “చిరు వ్యాపారుల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉపాధికి తోడ్పడేలా బండ్లు, కుట్టుమిషన్లు, జలధారాలు, ఆరోగ్య రథాలు, అన్నా క్యాంటీన్లు, పాదచారులకు సిమెంటు బెంచీలు తదితర 27 సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి,” అని పేర్కొన్నారు.
✅ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
వాసా పద్మా, షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్రావు, మాజేటి వేణుగోపాలకృష్ణ షష్టి, వంగర హనుమాన్, రుద్రు కోటేశ్వరరావు, బైరబోయిన శ్రీనివాసరావు, నల్ల గోర్ల శివరామకృష్ణ, బలబద్రపు రమేష్, సింహాద్రి బేబీరాణి, పిల్లెల్ల నాగరాజు, సరమేకల, గంగాధర్, దొడ్డి ఈశ్వరరావు, చంద్రగిరి పేరయ్య, చప్పిడి సురేంద్ర శంకర్, తోట శ్రీనుబాబు, కొత్త శ్రీనివాసరావు, కొల్లి వెం
కట్రావు, తోట సాంబ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి