మంగళగిరి నియోజకవర్గంలో రేపు మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన
మంగళగిరి, ఆగస్టు 13:
రేపు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన చేపట్టనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని స్థానికులతో సమావేశమవుతారు.
పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఉదయం 10:30 గంటలకు — మంగళగిరి గోలి వారి వీధిలో లక్ష్మి శారీస్ వస్త్ర దుకాణాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభిస్తారు.
ఉదయం 11:30 గంటలకు — కాజ గ్రామంలోని పంచాయతి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కుట్టుమిషన్ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి సందర్శిస్తారు.
సాయంత్రం 4:00 గంటలకు — పాత మంగళగిరి జీ ఆర్ స్కూల్ రోడ్‌లోని RR హ్యాండ్లూమ్ షోరూమ్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు.
కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి