గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

గుంటూరు నగరంలోని 25వ డివిజన్‌లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కావేరి నగర్ 1వ లైన్, గెలాక్సీ బార్ రోడ్, దుర్గా నగర్ 3వ లైన్, కొత్త కాలనీ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, "ప్రజల సౌకర్యార్థం రహదారులు, కాల్వలు, కల్వర్టులు అత్యంత అవసరం. పౌరుల సమస్యలను దశలవారీగా పరిష్కరించి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం" అని తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు మాట్లాడుతూ, "గుంటూరులో మౌలిక వసతులను బలోపేతం చేయడం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి డివిజన్‌లోన...