పోస్ట్‌లు

telugudesam లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నాయీ బ్రాహ్మణుల హర్షం

చిత్రం
                                         మంగళగిరి టౌన్: నాయీ బ్రహ్మణుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళగిరి నియోజకవర్గ నాయీ బ్రహ్మణ సేవా సంఘం మంగళవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించింది. మంగళగిరి పట్టణంలోని నాయీ బ్రహ్మణ కమ్యూనిటీ హాలు నుంచి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. నాయీ బ్రహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ – “వృత్తి ఆధారిత వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా కల్లుగీత కార్మికులు, నాయీ బ్రహ్మణులు, చేనేత కార్మికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. నాయీ బ్రహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి నెలవారీ వేతనం 25,000 రూపాయలకు పెంచడం వంటి చర్యలు వారి జీవితాల్లో వెలుగు నింపాయి” అని తెలిపారు.                 ...

బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

చిత్రం
                                             గుంటూరు: తెలుగుదేశం పార్టీనే బీసీలకు పుట్టినిల్లు అని, బీసీలను రాజకీయంగా ప్రోత్సహించి చట్టసభల్లోకి తీసుకెళ్లింది అన్న ఎన్టీఆర్ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో యాదవ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. అనంతరం బీసీ నేతలు ఎమ్మెల్యే గళ్ళా మాధవిని ఘనంగా సత్కరించారు.                                         ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... “గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీల అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. రాజకీయంగా ఎదగటానికి, సామాజికంగా ఎదగటానికి బీసీలకు అన్ని విధాల సహకారం అందిస్తాను. గతంలోనే బీసీ సంక్షేమం కోసం అసెంబ్లీలో పలు మార్లు బలంగా మాట్లాడాను. ముఖ్యంగా బీసీ భవన్ నిర్మాణం కోసం నా వంతు కృషి చేశాను” అని తెలిపారు. అలాగే, పీ–4 విధాన...