బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు: తెలుగుదేశం పార్టీనే బీసీలకు పుట్టినిల్లు అని, బీసీలను రాజకీయంగా ప్రోత్సహించి చట్టసభల్లోకి తీసుకెళ్లింది అన్న ఎన్టీఆర్ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో యాదవ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. అనంతరం బీసీ నేతలు ఎమ్మెల్యే గళ్ళా మాధవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... “గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీల అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. రాజకీయంగా ఎదగటానికి, సామాజికంగా ఎదగటానికి బీసీలకు అన్ని విధాల సహకారం అందిస్తాను. గతంలోనే బీసీ సంక్షేమం కోసం అసెంబ్లీలో పలు మార్లు బలంగా మాట్లాడాను. ముఖ్యంగా బీసీ భవన్ నిర్మాణం కోసం నా వంతు కృషి చేశాను” అని తెలిపారు. అలాగే, పీ–4 విధాన...