పోస్ట్‌లు

CleanCity లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్ బాధ్యతగా పనిచేయాలి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

చిత్రం
                                         గుంటూరు: గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్ తమ పరిధిలో పూర్తి బాధ్యతతో పనిచేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి సూచించారు. బుధవారం గుంటూరు పశ్చిమ పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవి పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ – రోజువారీ చెత్త డోర్ టు డోర్ కలెక్షన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రధాన రహదారులు, కాలనీలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు, కాలువలు క్రమం తప్పకుండా శుభ్రం చేసి నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గారు ఇంకా, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాల పరిసరాల్లో చెత్త డంపింగ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, చెత్త వర్గీకరణ (డ్రై & వెట్ వేస్ట్) పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించ...