పోస్ట్‌లు

ZeroFloodGuntur లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు

చిత్రం
                                              గుంటూరు, బైపాస్ రోడ్: గుంటూరు బైపాస్ ప్రాంతంలో నాలుగు డ్రైనేజీలకు సరైన నీటి ప్రవాహం లేకపోవడంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యపై సమాచారం అందుకున్న అనంతరం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, బైపాస్ వద్ద మురుగు నీటి ప్రవాహం కోసం ప్రత్యేక వంతెన నిర్మాణం అవసరమని గుర్తించి, దీనిపై నేషనల్ హైవే అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ముంపు సమస్యలను తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మొండిగేటు వద్ద అదనపు వెంట్ వే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ప్రజల సురక్షిత జీవనానికి మరియు రైతుల పంటల రక్షణకు డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం చేయడం ప్రాధాన్యంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం పట్టుదలతో చర్యలు తీసుకుంటూ, గుంటూరులో ముంపు సమస్యలు ఇకపై ప్రజల జీవితాలను ప్రభావితం చేయకుండా కృషి చేస్తామని నసీర్ హామీ ఇచ్చారు.