పోస్ట్‌లు

ఎల్వోసీ చెక్కు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

టిడ్కోలో రూ.70,000 ఎల్వోసీ చెక్కు అందజేత

చిత్రం
                                              మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ (టిడ్కో)కు చెందిన గుంటి చంద్రావతికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.70,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్‌ (ఎల్వోసీ) మంజూరైంది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ సహాయం అందగా, స్థానిక టిడిపి నాయకులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె భర్తకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చెక్కు అందజేత కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, టిడిపి నాయకులు ఊట్ల కనక మల్లిఖార్జునరావు, బూదాటి శ్రీనివాసరావు, ఇండ్ల రజని, కొండా జనార్దన్, కొల్లి శ్రీనివాసరావు, జంజనం సాంబశివరావు, ఉప్పు మహేష్, కాకి మల్లిఖార్జున రావు, గోపిశెట్టి రాజశేఖర్, సాల లీలావతి, విజయ తదితరులు పాల్గొన్నారు.