పోస్ట్‌లు

GunturWestMLA లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరు శ్యామల నగర్ గేట్ వద్ద ట్రాఫిక్ రద్దీపై ఎమ్మెల్యే గళ్ళా మాధవి పరిశీలన

చిత్రం
                                             గుంటూరు: గుంటూరు నగరంలోని శ్యామల నగర్ గేట్ పరిసర ప్రాంతంలో తీవ్రంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు మంగళవారం ఆకస్మికంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ శ్రీ సింగయ్యతో సమావేశమైన ఆమె, రద్దీ నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రోడ్ల విస్తరణ, వాహనాల సక్రమ పార్కింగ్, సిగ్నల్ వ్యవస్థలో మార్పులు వంటి పలు సూచనలు చేశారు. నగర అభివృద్ధి భాగంగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. స్థానికులు ఆమె వేగవంతమైన స్పందనపై కృతజ్ఞతలు తెలిపారు.

ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

చిత్రం
                                            గుంటూరు: గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ఆకస్మికంగా పరిశీలించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ద్విచక్రవాహనం పై స్వయంగా ప్రయాణిస్తూ పట్టాభిపురం, గుజ్జనగుండ్ల, కోరిటిపాడు, బ్రాడిపేట, శ్యామల నగర్ రైల్వే గేట్, కంకరగుంట ఆర్‌యూ‌బి, జేకేసి కాలేజీ రోడ్డు, ఐటీసీ వంటి కీలక ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.                                           ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్యకు ఆమె సూచించారు. ముఖ్యంగా రోడ్డు జంక్షన్ల వద్ద అదనపు సిబ్బ...