ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

                                           



గుంటూరు:

గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ఆకస్మికంగా పరిశీలించారు.


ఎమ్మెల్యే గళ్ళా మాధవి ద్విచక్రవాహనం పై స్వయంగా ప్రయాణిస్తూ పట్టాభిపురం, గుజ్జనగుండ్ల, కోరిటిపాడు, బ్రాడిపేట, శ్యామల నగర్ రైల్వే గేట్, కంకరగుంట ఆర్‌యూ‌బి, జేకేసి కాలేజీ రోడ్డు, ఐటీసీ వంటి కీలక ప్రాంతాలను సందర్శించి ట్రాఫిక్ పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

                                         


ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్యకు ఆమె సూచించారు. ముఖ్యంగా రోడ్డు జంక్షన్ల వద్ద అదనపు సిబ్బందిని నియమించి, వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ,

“శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పనులు పూర్తయిన తర్వాత గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్పటివరకు ప్రజలు సహనం పాటించి సహకరించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులను నిరంతరం మానిటరింగ్ చేస్తాను” అని భరోసా ఇచ్చారు.

                                


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి