మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి

                                         



తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని శ్మశానవాటికలు ఆధునిక సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ కృషి, సొంత నిధులతో వడ్డేశ్వరం గ్రామంలో ఉన్న ఎనిమిది శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు.

                                       


సోమవారం స్థానిక నాయకులు మంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు గతంలో ప్రహరీ గోడలు లేకపోవడం, తాగునీటి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సొంత నిధులతో పరిష్కార చర్యలు చేపట్టారు.


ప్రధాన సౌకర్యాలు


ప్రత్యేక నిర్మాణాలతో కూడిన చితులు


వెయిటింగ్‌ హాళ్లు


తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన గదులు


కేశ ఖండనం, దుస్తులు మార్చుకునే గదులు


బూడిద నిల్వ సౌకర్యం

                                  



ఈ సౌకర్యాల వల్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, వడ్డేశ్వరంలో హిందూ, ముస్లిం, మాదిగ, మాల, గౌడ, రజక, కన్వర్టెడ్, యాదవ-మరాఠి వంటి అన్ని సామాజికవర్గాల శ్మశానవాటికలను మంత్రి లోకేష్ సమానంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఇంత విస్తృత స్థాయిలో శ్మశానవాటికల అభివృద్ధి ఇతర ఎక్కడా జరగలేదని ఆయన తెలిపారు.

                                          


ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈపూరి బాబు, నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, ఎర్రగుంట్ల భాగ్య రావు, మల్లవరపు వెంకట్, షేక్ రియాజ్, వేమూరి మైనర్ బాబు, ఎండీ ఇబ్రహీం, కొల్లి శేషు, దాసరి కృష్ణ, కాంట్రాక్టర్ వెలగపూడి కిషోర్ బాబు, బొర్రా కృష్ణ వందన, షేక్ అక్రమ్, ఎస్‌.కె. ఇబ్రహీం, యలమంచిలి పద్మజ, మద్దినేని సుబ్రహ్మణ్యం, జోరుగా దాసు, గుంపెన నాగేశ్వరరావు, షేక్ ఇమాంస, అంజుమన్, కమిటీ పెద్దలు, క్రిస్టియన్ పాస్టర్లు, గ్రామ పెద్దలు త

దితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి