200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నాయీ బ్రాహ్మణుల హర్షం

 

                                      


మంగళగిరి టౌన్:

నాయీ బ్రహ్మణుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళగిరి నియోజకవర్గ నాయీ బ్రహ్మణ సేవా సంఘం మంగళవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించింది.


మంగళగిరి పట్టణంలోని నాయీ బ్రహ్మణ కమ్యూనిటీ హాలు నుంచి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. నాయీ బ్రహ్మణులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ –

“వృత్తి ఆధారిత వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యంగా కల్లుగీత కార్మికులు, నాయీ బ్రహ్మణులు, చేనేత కార్మికుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. నాయీ బ్రహ్మణుల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేస్తున్న వారికి నెలవారీ వేతనం 25,000 రూపాయలకు పెంచడం వంటి చర్యలు వారి జీవితాల్లో వెలుగు నింపాయి” అని తెలిపారు.

                                         


అలాగే రాష్ట్ర నాయీ బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరి రావు మాట్లాడుతూ –

“నాయీ బ్రహ్మణుల గౌరవ వేతనం రూ.20 వేలు నుంచి రూ.25 వేల వరకు పెంచిన జీవో నెంబర్ 130ను దేవాదాయ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. 6A కేటగిరి దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న 44 దేవాలయాల్లో ఈ జీవో అమలుకానుంది. దేవాలయ కమిటీల్లో నాయీ బ్రహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించేలా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి” అని వివరించారు.


మంత్రి నారా లోకేష్ నాయీ బ్రహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గంలో తన స్వంత నిధులతో 200 సెలూన్ కుర్చీలు అందజేసిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, ఉపాధ్యక్షురాలు వాసా పద్మ, వల్లూరి శివయ్య, ఆకునూరి ఉమామహేశ్వరరావు, తెంపల్లి దుర్గారావు, కొక్కిరిపాటి పూర్ణచంద్రరావు, ఊట్ల దుర్గమల్లేశ్వరి, వాకా మాధవరావు, పందేటి తిరుపతయ్య, ఆకునూరి కరుణా తదితరులు పాల్గొన్నారు.

                                    



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి