గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాశ్వత విద్యుత్ సమస్యల పరిష్కార దిశగా చర్యలు

గుంటూరు, ఆగస్టు 21: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో ప్రతినిధులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాలను మార్చడం, కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రవికుమార్ గారు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా హామీ ఇచ్చారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరితగతిన చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు.