ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహణ – మంత్రి నారా లోకేష్
16,347 పోస్టులతో మెగా డీఎస్సీ విజయవంతం – ఇకపై ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీ
అమరావతి:
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించిన ప్రకారం ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ (DSC) నిర్వహించి, ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.
ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ –
ఉపాధ్యాయుల సమయాన్ని వృథా చేసే అనవసర శిక్షణా కార్యక్రమాలను నివారించాలని సూచించారు.
ఫలితాల మెరుగుదలపై దృష్టి పెట్టడం అధికారులు, ఉపాధ్యాయుల బాధ్యత అని గుర్తుచేశారు.
రాష్ట్రం ప్రస్తుతం ఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (FLN) అమలులో దేశవ్యాప్తంగా 14వ స్థానంలో ఉందని, దీనిని మెరుగుపరచాలని సూచించారు.
ప్రతి బిడ్డకు గ్యారెంటీడ్ FLN హక్కుగా అందించే విధానాన్ని దేశంలో తొలిసారిగా అమలు చేస్తున్నామని తెలిపారు.
---
తల్లికి వందనం – చివరి విడత నిధుల విడుదల
తల్లికి వందనం పథకంలో పెండింగ్ దరఖాస్తుల కోసం రూ. 325 కోట్లు విడుదల చేశారు.
2024–25 ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
---
మౌలిక సదుపాయాల అభివృద్ధి – దాతల సహకారం
ప్రభుత్వ పాఠశాలల్లో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి దేశ–విదేశాల్లోని దాతల సహకారం తీసుకోవాలని సూచించారు.
ప్రతి పాఠశాల అవసరాలను చూపించే ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి, ఆసక్తిగల వారు స్కూళ్లను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.
రాష్ట్రంలోని 125 ఆటిజం సెంటర్ల నిర్మాణంను వెంటనే ప్రారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలని ఆదేశించారు.
---
సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం – దేశంలోనే ఉత్తమ మోడల్
అమరావతిలో 2 లక్షల చదరపు అడుగుల్లో సెంట్రల్ లైబ్రరీని ఏడాదిలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నంలో 50,000 అడుగుల్లో రీజనల్ లైబ్రరీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీల సమయపాలన కోసం ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయాలని సూచించారు.
అన్ని లైబ్రరీలను అనుసంధానించే ఇంటిగ్రేటెడ్ కామన్ సాఫ్ట్‌వేర్, వెబ్‌సైట్ను రూపొందించాలని తెలిపారు.
---
లైబ్రరీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
స్థానిక సంస్థల నుండి పెండింగ్‌లో ఉన్న రూ. 213 కోట్లు రాబట్టి లైబ్రరీల అభివృద్ధికి వినియోగించాలన్నారు.
విద్యార్థుల్లో ఆసక్తి పెంచే కమ్యూనిటీ కార్యక్రమాలు లైబ్రరీల ద్వారా నిర్వహించాలని సూచించారు.
ఇటీవల లైబ్రరీ పుస్తకాలతో చదివి 350 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు.
---
సమావేశంలో పాల్గొన్నవారు
విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్. దీవెన్ రెడ్డి
, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి