మంగళగిరి నియోజకవర్గంలో “దీర్ఘ సుమంగళీభవ” – దళిత కుటుంబాల పెళ్లిళ్లకు కానుకగా బంగారు మంగళసూత్రాల అందజేత
మంగళగిరి:
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తిగా, మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాటిలో భాగంగా నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ల చిరంజీవి, “దీర్ఘ సుమంగళీభవ” పేరుతో దళిత కుటుంబాల వివాహాలకు పెండ్లి కానుకగా బంగారు మంగళసూత్రాలను అందజేస్తున్నారు.
ఈ కార్యక్రమం 2022 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున ప్రారంభమై, ఇప్పటి వరకు మొత్తం 255 మంది వధువులకు సుమారు రూ.9వేల విలువైన బంగారు మంగళసూత్రాలు అందజేయబడ్డాయి. పెళ్లికి వారం రోజుల ముందు ఆహ్వాన పత్రికను టిడిపి కార్యాలయంలో అందజేస్తే, వరుని కుటుంబానికి మంగళసూత్రం అందజేయడం జరుగుతుందని కనికళ్ల చిరంజీవి తెలిపారు.
ఇదే సమయంలో, మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో కుల మత భేదాలకు అతీతంగా వివాహాల సందర్భంగా నూతన వధూవరులకు పలు కానుకలు అందజేస్తూ వస్తున్నారని, అదే మార్గంలో తాను కూడా దళిత కుటుంబాలకు మంగళసూత్రాలు అందజేయడం కొనసాగిస్తానని ఎస్సీ సెల్ అధ్యక్షులు పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని దళిత కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి