పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరు కాకాని రోడ్‌లో జేవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

చిత్రం
                                                   గుంటూరు, ఆగస్టు 17 : గుంటూరు కాకాని రోడ్డులో ఆధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన జేవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి గారు నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆధునిక ఆసుపత్రులు ఎంతో ఉపయుక్తమవుతాయని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, 24 గంటల అత్యవసర వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.                                     

గుంటూరులో నర్సింగ్ విద్యార్థుల కోసం జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ & ప్లేస్మెంట్ కార్యక్రమం ప్రారంభం

చిత్రం
                                             గుంటూరు నగరంలోని B.R స్టేడియం వద్ద గల కోడిగుడ్డు సత్రంలో, SC, ST నర్సింగ్ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం సోషల్ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు నగర మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర (నాని), గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందుకోవచ్చని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని తెలిపారు.                                                  ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, సోషల్ వెల్ఫేర్ D...

గుంటూరులో పోలేరమ్మ తల్లి సేవలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

చిత్రం
                                             గుంటూరు నగరంలోని 18వ డివిజన్ ఆర్. అగ్రహారం పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు, కొలుపుల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, “పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులతో గుంటూరు ప్రజలు సుఖశాంతులతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం దేవుని ఆశీస్సులు తోడై గుంటూరును మరింత ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.                                         ...

తెనాలి నియోజకవర్గంలో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య, కంటి వైద్య శిబిరాల ప్రారంభం

చిత్రం
                                                తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో ఫీనిక్స్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఆరోగ్య మరియు కంటి వైద్య శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, ఫీనిక్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు మరియు చికిత్సలు పొందారు.

గుంటూరులో పురాతన కోనేరు అభివృద్ధికి మేయర్ రవీంద్ర హామీ

చిత్రం
                                        గుంటూరు, ఆగస్టు 16: ఈ రోజు (శనివారం) ఉదయం గుంటూరు నగరంలోని ఆర్.గ్రహారం కోనేరు ప్రాంతాన్ని నగర మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర (నాని) గారు పర్యటించారు. ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, పురాతన కోనేరు అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ రవీంద్ర మాట్లాడుతూ – “కోనేరు అభివృద్ధి కోసం సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకుంటాము. ప్రజలకు ఉపయోగకరంగా, శాశ్వతంగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము” అని తెలిపారు. అనంతరం ఆయన ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంజునాథ గారు, ఎం.వి. ప్రసాద్ గారు, చౌదరి శ్రీను గారు, శానం రమేష్ గారు, బెల్లంకొండ రాము గారు, ప్రసాద్ గారు, శ్రీను గారు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం

చిత్రం
                                               గుంటూరు, ఆగస్టు 16: సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “ప్రజల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వలసవాద వ్యతిరేకంగా పోరాడిన మహానేత సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎల్లప్పుడూ ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత” అని అన్నారు.

గుంటూరులో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం

చిత్రం
                                              గుంటూరు, ఆగస్టు 16: గుంటూరు బస్టాండ్ వద్ద సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మహమ్మద్ నసీర్ హాజరై, లచ్చన్న గారి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ – “ప్రజల పక్షాన జీవించిన మహానేత శ్రీ లచ్చన్న గారు పేదల హక్కుల కోసం, కార్మికుల సంక్షేమం కోసం, వలసవాద వ్యతిరేక ఉద్యమంలో అజరామరమైన పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం నాకు గర్వంగా ఉంది” అన్నారు. అలాగే ఆయన “లచ్చన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన వేసిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.                                       

తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

చిత్రం
                                        తెనాలి, ఆగస్టు 16: తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 27 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.27,29,948 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేద, అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుంది. వైద్య చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యం” అని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో మొత్తం 242 మంది లబ్ధిదారులకు రూ.3.04 కోట్ల సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించామని వివరించారు.                                        

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాసంలో వరలక్ష్మీ వ్రతం ఘనంగా

చిత్రం
                                            గుంటూరు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారి నివాసంలో ఈరోజు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఎన్డీయే కూటమికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి, పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. భక్తిరసపూర్ణ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న మహిళలు, అమ్మవారి దీవెనలతో సౌభాగ్యం, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని కోరుకున్నారు.                                        

గుంటూరులో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు పథకం ఘన ప్రారంభం – గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ పాల్గొన్నారు

చిత్రం
                                              గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ – ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టాండ్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మహ్మద్ నసీర్ సహచర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.                                          మహిళల రవాణా సౌకర్యం పెంచడం, ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు.                                              

మంగళగిరిలో స్త్రీ శక్తి పథకం ఆరంభం: సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ మహిళలతో ఉచిత బస్సు ప్రయాణం

చిత్రం
                                                మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా పాల్గొన్నారు. ముందుగా ఉండవల్లి సమీపంలోని బస్టాండ్‌కు చేరుకున్న వీరికి స్థానిక ప్రజలు, నాయకులు శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి ఉచిత బస్సులో విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు ప్రయాణించారు. మార్గమంతా మహిళలు, కూటమి నేతలు ఉత్సాహంగా స్వాగతం పలకగా, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు .

తెనాలిలో ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం – మంత్రి నాదెండ్ల మనోహర్

చిత్రం
                                           తెనాలి, ఆగస్టు 15: రాష్ట్ర మంత్రివర్యులు మరియు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఈ రోజు తెనాలిలో “స్త్రీ శక్తి – ఉచిత బస్సు ప్రయాణ పథకం”ను అధికారికంగా ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం అనంతరం, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నుంచి విజయవాడకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ, మహిళలకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రవాణా సౌకర్యాల అభివృద్ధికి ఈ పథకం మరింత తోడ్పడుతుందని భావిస్తున్నారు..                                          

గుంటూరు స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేష్ – అభివృద్ధి పై చర్చించిన మహ్మద్ నసీర్

చిత్రం
                                                గుంటూరు: ఆగస్టు 15న గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రధాన అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. ఈ సందర్భంగా గుంటూరు అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న మహ్మద్ నసీర్ గారు మంత్రి లోకేష్ గారిని ఆత్మీయంగా స్వాగతించారు. స్వాతంత్ర్య దినోత్సవం పట్ల ఆయన చూపిన ప్రగాఢ భావోద్వేగం, దేశభక్తి అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం మహ్మద్ నసీర్ గారు, మంత్రి లోకేష్ గారితో గుంటూరు అభివృద్ధి కోసం చేపడుతున్న కొత్త చర్యలు, ప్రాధాన్యతా అంశాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల మెరుగుదల ద్వారా శాశ్వత అభివృద్ధి సాధ్యమని మంత్రి లోకేష్ గారు అభిప్రాయపడ్డారు. మంత్రి లోకేష్ గారి ప్రజల పట్ల దూరదృష్టి, అభివృద్ధి పట్ల అంకితభావం గుంటూరు ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపిందని మహ్మద్ నసీర్ గారు తెలిపారు.

గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గళ్ళా మాధవి, నారా లోకేష్

చిత్రం
                                            గుంటూరు: గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రధాన అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు కూడా హాజరయ్యారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, గౌరవ వందనాలు, మరియు వివిధ విభాగాల ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు: 57వ వార్డులో జెండా వందనం ఘనంగా

చిత్రం
                                           గుంటూరు: 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 57వ వార్డులో జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకొని, ప్రజలు దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ఆత్మకూరు వేణుబాబు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

గుంటూరులో జాగర్లమూడి చంద్రమౌళి లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

చిత్రం
                                          గుంటూరులోని జాగర్లమూడి చంద్రమౌళి కాలేజీ ఆఫ్ లాలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కాలేజీ కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్సీ డా. రాయపాటి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సుధాకర్ మరియు నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ బోర్డు సభ్యుల సమక్షంలో, గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ న్యాయవాది పట్టా అందుకున్నారు. అరుదైన సంఘటన: మాజీ గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి మరియు తెలుగుయువత విభాగాల అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తి చేతుల మీదుగా, మాజీ గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షుడు మరియు ప్రస్తుత గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షునికి లా పట్టా ప్రదానం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అరుదైన ఘట్టంపై సహచర విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్లు న్యాయ విద్య యొక్క ప్రాముఖ్యత, సమాజంలో న్యాయవాదుల పాత్ర, మరియు విద్యార్థులు న్యాయం కోసం కృష...

గుంటూరు ఉమెన్స్ కాలేజీకి నూతన తరగతి గదుల నిర్మాణం – ప్రారంభోత్సవం ఘనంగా

చిత్రం
                                                             గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల కొరత సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యను గమనించిన ప్రముఖ వైద్య నిపుణులు డా. శనక్కాయల ఉమాశంకర్ మరియు డా. శనక్కాయల రాజకుమారి దంపతులు తమ సొంత నిధులతో నూతన తరగతి గదులను స్వచ్ఛందంగా నిర్మించారు.                                          మాజీ మంత్రివర్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డా. శనక్కాయల అరుణ కుమారి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈ నూతన తరగతి గదులను గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా. శనక్కాయల అరుణ కుమారి, డా. శనక్కాయల గౌరీశంకర్, డా. శనక్కాయల ఉమాశంకర్–రాజకుమారి దంపతులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ప...

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి విజయంపై గుంటూరు ఈస్ట్‌లో సంబరాలు

చిత్రం
                                         పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఆనందోత్సవాలు మిన్నంటాయి. ఈ విజయంతో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో పొన్నూరు రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై విజయోత్సవాలు జరుపుకున్నారు. బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుతూ, విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. గెలుపు తర్వాత గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని కూటమి నాయకులు మాట్లాడుతూ, పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు చూపించిన విశ్వాసం తమకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిందని తెలిపారు. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, మరియు ప్రతి కార్యకర్త యొక్క కష్టమే ఈ విజయానికి ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. ఓటర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా భవిష్యత్‌లో మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గెలుపొందిన కూటమి అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, వారు తమ ప్రాంత ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తా...

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్

చిత్రం
                                         తెనాలి నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం పర్యటించారు. కొల్లిపర మండలంలోని కరకట్ట సమీప లంక గ్రామాలకు చేరుకున్న మంత్రి, వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బందితో సమావేశమై, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.                                           అనంతరం అత్తోట, ఐతానగర్ సమీప గోలిడొంక ప్రాంతాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.                                   ...

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలను కలుసుకున్న మంత్రి నారా లోకేష్

చిత్రం
                                         మంగళగిరి: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజలను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు (అర్జీలు) సమర్పించగా, మంత్రి ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను పూర్తిగా విన్నారు. లోకేష్, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరిత పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అవసరమైన విభాగాలకు అర్జీలను పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తానని తెలిపారు. ప్రజలతో స్వయంగా మమేకమై, సమస్యలపై ప్రత్యక్షంగా స్పందించిన మంత్రి పట్ల హాజరైన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గుంటూరు నగర శుభ్రత, అభివృద్ధికి మంత్రి నారాయణతో కీలక నిర్ణయాలు

చిత్రం
                                     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన గుంటూరు నగర అభివృద్ధి, శుభ్రత పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొల్లి శారద మార్కెట్ ప్రాంత అభివృద్ధి, నగరంలోని ఖాళీ స్థలాల శుభ్రపరిచే చర్యలు, వీధి కుక్కల నియంత్రణ, మోపుల శుభ్రత వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. నగర భద్రత, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం సమగ్ర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

గుంటూరు పశ్చిమ అభివృద్ధి కోసం మంత్రి పొంగూరు నారాయణతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి భేటీ

చిత్రం
                                         గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు తగిన నిధుల మంజూరుపై బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయిలు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీటిలో వీధి కుక్కల నియంత్రణ, ఖాళీ స్థలాల శుభ్రపరిచే చర్యలు, కాలువల శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, డ్రైనేజ్ సమస్యలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ – "గుంటూరు పశ్చిమ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం మా ప్రధాన లక్ష్యం. వీధి కుక్కల సమస్య, పారిశుద్ధ్య లోపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని మంత్రిని కోరాను. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు నేను నిరంతరం కృషి చేస్తాను" అ...

మంగళగిరిలో ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభం

చిత్రం
                                        మంగళగిరి పట్టణంలోని జీఆర్ స్కూల్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటైన ఆర్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ షోరూమ్‌ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మనవడు ఆర్. రోహిత్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభమైంది.                                        షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు, స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను పరిశీలించిన మంత్రి, చేనేత వస్త్రాలను వీక్షించారు. శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీమతి నారా బ్రాహ్మణి కోసం చేనేత చీరలను స్వయంగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన — అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన

చిత్రం
                                       మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.                                     లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ప్రారంభం          మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన అనంతరం, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించిన ఆమె, చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్ల వివరాలు, చేనేత రంగానికి అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ...

గుంటూరు ఎటుకూరు రోడ్ బైపాస్‌లో అభయాంజనేయస్వామి దేవాలయ నూతన మెట్ల మార్గం శంకుస్థాపన

చిత్రం
                                             గుంటూరు, ఆగస్టు 13: గుంటూరు ఎటుకూరు రోడ్ బైపాస్‌లోని శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్న 79 అడుగుల ఎత్తైన మెట్ల మార్గానికి శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ పూజారులు, నిర్వాహకులు వేద మంత్రాల మధ్య పూజలు నిర్వహించి, కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగించారు. మన్నవ మోహనకృష్ణ గారు ఈ సందర్భంలో మాట్లాడుతూ, “భక్తుల సౌలభ్యం కోసం నూతన మెట్ల మార్గం ఏర్పాటు చేయడం సంతోషకర విషయం. ఇది దేవాలయ అభివృద్ధికి, భక్తుల ఆరాధనకు మరింత సౌకర్యం కల్పిస్తుంది” అని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.                     ...

పాతగుంటూరు లో రాములవారి గుడి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో షేక్ నూరి ఫాతిమా గారు పాల్గొనడం

చిత్రం
                                              గుంటూరు, ఆగస్టు 13: ఈ రోజు పాతగుంటూరులో రాములవారి గుడి ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తుల ఉత్సాహం, భజనల మ్రోగింపు, మంగళవాయిద్యాల నాదం మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయాయి. ఈ సందర్భంగా గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై, ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆమెకు స్వాగతం పలికి, ఆశీర్వాదాలు అందజేశారు. ప్రతిష్ఠాపన అనంతరం, గుడి పరిసరాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనపై నిర్వాహకులు మరియు స్థానికులతో షేక్ నూరి ఫాతిమా గారు చర్చించారు. స్థానిక ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.                                          

గుంటూరు జిల్లా గడ్డీపాడు వద్ద చెరువు గట్టు తెగిపోవడంతో భారీ నీటి ముప్పు

చిత్రం
                                        గుంటూరు, ఆగస్టు 13: గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గడ్డీపాడు వద్ద గల చెరువు గట్టు తెగిపోవడంతో, పెద్ద ఎత్తున నీరు సమీప నివాస ప్రాంతాల్లోకి వెల్లువలా చేరింది. ఈ అకస్మాత్తు పరిస్థితి కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఇళ్లు, వీధులు నీట మునిగిపోవడంతో రవాణా అంతరాయం ఏర్పడింది. గృహోపకరణాలు, ఆహార పదార్థాలు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే, గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రభావిత ప్రాంత ప్రజల సమస్యలను విన్న ఆమె, తక్షణ సహాయ చర్యలు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక అధికారులు చెరువు గట్టు మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని, అలాగే నీరు తగ్గించే చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైనంత వరకు సురక్షిత ప్రదేశాల...

గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జూనియర్ రెడ్ క్రాస్ ప్రాజెక్ట్ ప్రారంభం, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు స్వాగతం

చిత్రం
                                          గుంటూరు, ఆగస్టు 12: గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో "ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ" ఆధ్వర్యంలో జూనియర్ రెడ్ క్రాస్ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు. అలాగే, ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ విధించే, ప్లాస్టిక్ వాడకంలేని అమరావతి కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా సందర్శకులుగా రాబోయిన రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు (IAS రిటైర్డ్) ఘనంగా స్వాగతించారు. డా. బూర్ల రామాంజనేయులు గారు మాట్లాడుతూ, జూనియర్ రెడ్ క్రాస్ ప్రాజెక్ట్ ద్వారా యువతలో సామాజిక బాధ్యత కలిగించే సానుకూల ప్రభావం ఏర్పడాలని, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, విద్యార్థులు, RED CROSS సభ్యులు పాల్గొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో రేపు మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన

చిత్రం
                                        మంగళగిరి, ఆగస్టు 13: రేపు మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్, శ్రీమతి నారా బ్రాహ్మణి పర్యటన చేపట్టనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని స్థానికులతో సమావేశమవుతారు. పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ఉదయం 10:30 గంటలకు — మంగళగిరి గోలి వారి వీధిలో లక్ష్మి శారీస్ వస్త్ర దుకాణాన్ని నారా బ్రాహ్మణి ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు — కాజ గ్రామంలోని పంచాయతి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కుట్టుమిషన్ కేంద్రాన్ని నారా బ్రాహ్మణి సందర్శిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు — పాత మంగళగిరి జీ ఆర్ స్కూల్ రోడ్‌లోని RR హ్యాండ్లూమ్ షోరూమ్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంది.

కంచర్లపాలెంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన

చిత్రం
                                         తెనాలి, ఆగస్టు 12: తెనాలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కంచర్లపాలెం నుంచి తేలప్రోలు మీదుగా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి కలిపే 1.3 కిలోమీటర్ల పొడవు రహదారిని రూ. 1.55 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.