గుంటూరులో పురాతన కోనేరు అభివృద్ధికి మేయర్ రవీంద్ర హామీ

                                       


గుంటూరు, ఆగస్టు 16:

ఈ రోజు (శనివారం) ఉదయం గుంటూరు నగరంలోని ఆర్.గ్రహారం కోనేరు ప్రాంతాన్ని నగర మేయర్ శ్రీ కోవెలమూడి రవీంద్ర (నాని) గారు పర్యటించారు. ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి, పురాతన కోనేరు అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.


మేయర్ రవీంద్ర మాట్లాడుతూ – “కోనేరు అభివృద్ధి కోసం సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన అనుమతులు పొందేందుకు చర్యలు తీసుకుంటాము. ప్రజలకు ఉపయోగకరంగా, శాశ్వతంగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము” అని తెలిపారు. అనంతరం ఆయన ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు.


ఈ కార్యక్రమంలో మంజునాథ గారు, ఎం.వి. ప్రసాద్ గారు, చౌదరి శ్రీను గారు, శానం రమేష్ గారు, బెల్లంకొండ రాము గారు, ప్రసాద్ గారు, శ్రీను గారు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు