ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్

                                        


తెనాలి నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గురువారం మధ్యాహ్నం పర్యటించారు. కొల్లిపర మండలంలోని కరకట్ట సమీప లంక గ్రామాలకు చేరుకున్న మంత్రి, వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బందితో సమావేశమై, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

                                         


అనంతరం అత్తోట, ఐతానగర్ సమీప గోలిడొంక ప్రాంతాల్లో నీట మునిగిన వరి పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

                                       


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు