తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

                                       


తెనాలి, ఆగస్టు 16:

తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పంపిణీ చేశారు.


అనారోగ్యంతో బాధపడుతున్న 27 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.27,29,948 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ – “కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేద, అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుంది. వైద్య చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యం” అని అన్నారు.


అలాగే ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో మొత్తం 242 మంది లబ్ధిదారులకు రూ.3.04 కోట్ల సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించామని వివరించారు.

                                       


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు