గుంటూరు ఉమెన్స్ కాలేజీకి నూతన తరగతి గదుల నిర్మాణం – ప్రారంభోత్సవం ఘనంగా
గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల కొరత సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యను గమనించిన ప్రముఖ వైద్య నిపుణులు డా. శనక్కాయల ఉమాశంకర్ మరియు డా. శనక్కాయల రాజకుమారి దంపతులు తమ సొంత నిధులతో నూతన తరగతి గదులను స్వచ్ఛందంగా నిర్మించారు.
మాజీ మంత్రివర్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డా. శనక్కాయల అరుణ కుమారి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈ నూతన తరగతి గదులను గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నజీర్ అహ్మద్ గురువారం ఉదయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డా. శనక్కాయల అరుణ కుమారి, డా. శనక్కాయల గౌరీశంకర్, డా. శనక్కాయల ఉమాశంకర్–రాజకుమారి దంపతులు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినుల సౌకర్యార్థం ఈ తరగతి గదులు ఎంతో ఉపయుక్తం అవుతాయని కళాశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి