మంగళగిరిలో స్త్రీ శక్తి పథకం ఆరంభం: సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ మహిళలతో ఉచిత బస్సు ప్రయాణం

 

                                             


మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా పాల్గొన్నారు.


ముందుగా ఉండవల్లి సమీపంలోని బస్టాండ్‌కు చేరుకున్న వీరికి స్థానిక ప్రజలు, నాయకులు శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి ఉచిత బస్సులో విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు ప్రయాణించారు. మార్గమంతా మహిళలు, కూటమి నేతలు ఉత్సాహంగా స్వాగతం పలకగా, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు

.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు