మాయబజార్ రహదారి, మురుగు నీటి సమస్యలపై GMCకి వినతిపత్రం

 గుంటూరు, ఆగస్టు 5:

గుంటూరు నగరంలోని మాయబజార్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రహదారి దుస్థితి, అలాగే సంగడిగుంటలో పీకలవాగు కారణంగా మురుగు నీటి ప్రవాహం ఎక్కువై ప్రజలు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. కాలువలలో తడిసిపోయిన రహదారులు, మురుగు నీటి నిలువల వల్ల సాధారణ వాహనదారులు


మరియు స్థానిక వాసులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.


ఈ ప్రజాసమస్యలను దృష్టిలో పెట్టుకొని, వెంటనే స్పందించిన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీమతి షేక్ నూరీ ఫాతిమా గారు, సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) అధికారులతో సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా ఆమె, GMC ఎడిషనల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేసి, మాయబజార్ రోడ్ మరియు సంగడిగుంట ప్రాంతాల్లో రహదారి మరమ్మతులు, డ్రైనేజ్ శుభ్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు