మంగళగిరి: టిడిపి స్టేట్ ఆఫీస్ వద్ద అగ్నిప్రమాదం
మంగళగిరి, 06 ఆగస్టు 2025:
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో జాతీయ రహదారి వెంబడి వాహనానికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
ఈ అగ్ని ప్రమాదంతో కార్మికులు, అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. మంటలు పక్కనున్న టిడిపి ఆఫీస్‌కు చేరకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. ఘటన స్థలానికి వెంటనే ఫైరింజన్లు చేరుకొని మంటలను నియంత్రించాయి.
ప్రస్తుతం మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి