గుంటూరు నగరంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
గుంటూరు నగరం:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకంలోని అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు గుంటూరులో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ –
“మాకు ఎదురైన ఆరోగ్య సమస్యల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన ఈ ఆర్థిక మద్దతు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. ఈ సాయానికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము,” అని పేర్కొన్నారు.
లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మొహమ్మద్ నసీర్ గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ –
“ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేయడం మాది లక్ష్యం. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన వారికి తక్షణ సహాయం అందేలా నిరంతరం పాటుపడుతున్నాం,” అని
తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి