గుంటూరు: హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య – సోమవారం రాత్రి కేసు నమోదు
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఒకరు హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
చేరుకూరు గ్రామానికి చెందిన బాధిత విద్యార్థిని ఇటీవలే ఒక ప్రైవేట్ హాస్టల్‌లో చేరింది. అయితే, అక్కడి వాతావరణం, జీవన శైలి ఆమెకు ఇష్టంగా లేకపోవడంతో మానసికంగా ఒత్తిడికి లోనైనట్లు సమాచారం. కుటుంబ సభ్యుల చెబుతున్న మేరకు, విద్యార్థిని హాస్టల్ జీవితం పట్ల అసంతృప్తిగా వ్యవహరిస్తూ, ఇంటికి రావాలని కోరుతూ పలుమార్లు చెప్పినట్టు తెలుస్తోంది.
సోమవారం (ఆగస్టు 4) సాయంత్రం సమయంలో విద్యార్థిని హాస్టల్ భవనంపైకి వెళ్లి, పై అంతస్తు నుండి కిందకు దూకింది. తీవ్ర గాయాలతో ఆమె
మృతి చెందింది.
సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి విచారణ ప్రారంభించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగు
తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి