బాధ్యతాయుతంగా చిన్న మసీదు నూతన కమిటీ ఏర్పాట్లు – గుంటూరు చిన్న బజార్
గుంటూరు | తేదీ: 07-08-2025
గుంటూరు చిన్న బజార్ ప్రాంతంలోని చిన్న మసీదులో నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. మసీదు అభివృద్ధి, శుభ్రత, మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించగల నాయకులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించారు.
ఈ సందర్బంగా కొత్త కమిటీ సభ్యులు మాట్లాడుతూ,
> "మసీదు సంప్రదాయాలను, మతపర ఆచారాలను గౌరవిస్తూ, మైనారిటీ సమాజానికి అన్ని విధాలుగా సేవలు అందించేందుకు నూతన కమిటీ కట్టుబడి ఉంటుంది" అని తెలిపారు.
కమిటీ సభ్యులు మసీదు సంబంధిత ప్రధాన సమస్యలు, లోటుపాట్లపై సమాలోచన చేసి, వాటి పరిష్కార దిశగా ముందడుగు వేసేందుకు హామీ ఇచ్చారు. అలాగే, కమిటీ బాధ్యతలు చేపట్టిన సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే శ్రీ మహ్మద్ నసీర్ గారు పాల్గొని, కొత్తగా నియమితులైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే మసీదు అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని
హామీ ఇచ్చారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి