గుంటూరు | మహిళల సాధికారతకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరం ప్రారంభం

                               


  

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు.


ఈ శిబిరాన్ని 09.07.2025, శనివారం ఉదయం, కేంద్ర మంత్రివర్యులు మరియు గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నసీర్ అహమ్మద్ గారితో కలిసి ప్రారంభించారు.         




ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మహిళలు తమ స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టాం. శిక్షణ అనంతరం పాల్గొనే వారికి ఉచిత కుట్టు మిషన్లు అందిస్తాం. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాలలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, శిక్షణ సిబ్బంది, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు