నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

                                               


గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్లకు నెలకు 200 యూనిట్లు వరకు ఉచిత కరెంటు అందించనున్నట్లు ప్రకటించిన నిర్ణయంపై గుంటూరు 39వ డివిజన్, మారుతి నగర్‌లోని నాయి బ్రాహ్మణ కాలనీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.


ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ నిర్ణయం నాయి బ్రాహ్మణ సమాజానికి ఆర్థిక భారం తగ్గించి, జీవనోపాధిని మరింత సుస్థిరం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.


ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

                                


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు